జస్ట్ ఫర్ ఫన్

జస్ట్ ఫర్ ఫన్
నేను పుట్టినపుడు ఏడవలేదు
దబదబా దెబ్బలుపడ్డాయి
ప్రేమతో వీపు మీద
నేను ఏడ్చాను
అందరూ సంతోషించారు

జస్ట్ ఫర్ ఫన్
నాన్న పెన్ దాచేసాను
దబదబా దెబ్బలు పడ్డాయి
కోపంతో దవడ మీద
నేను ఏడ్చాను
అమ్మ ఓదార్చింది

జస్ట్ ఫర్ ఫన్
షేర్లతో ఆడుకున్నాను
దబదబా దెబ్బలుపడ్డాయి
బలంగా డబ్బుల మీద
నేను ఏడ్చాను
ఎందరో సంతోషించారు
ఎవరూ ఓదార్చలేదు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top