మన కవుల కొప్పుదల కాకపోయినా
చాలా పగళ్ళు చంద్రుడు కనిపిస్తాడు
మన కవుల కొప్పుదల కాకపోయినా
కలువలు పగళ్ళూ విచ్చుకుంటాయి
మన కవుల కొప్పుదల కాకపోయినా
చాలా కవిసమయాలు నిజాలు కావు
మన కవుల కొప్పుదల కాకపోయినా
అకవులు కవులుగా గొప్పలుపోతారు
మన కవుల కొప్పుదల కాకపోయినా
కుకవులు బిరుదులు పొందుతుంటారు
మన కవుల కొప్పుదల కాకపోయినా
రాని రేపుకై వాళ్ళకు నిరీక్షణ తప్పదు
మన కవుల కొప్పుదల కాకపోయినా
కవులెందరికో మంచి సమయాలే రావు
22-4-2026



గొప్పు తవ్వి నీటి కాలువ తవ్వి మొక్క నాటితే మంచి పంటకి వచ్చి నట్టు, కవులు కూడా గొప్పవారు కావటానికి మంచి మాట వంటికి పట్టి ఉంటూ అనుకూల పర్యావర్ణం యేర్పాటు వుండాలి.
పర్యావర్ణం తపస్వీ ని తయారు చెస్తుంది.
కవితధారా పంటగా అనుభవించవచ్చు.
Hi there, just wanted to tell you, I liked this blog post.
It was inspiring. Keep on posting!