పయనమునకు సిధ్ధమై పడతుకల జూడగ
స్వయముగా వచ్చిన చక్కని కృష్ణా
శ్రీమంతుడా నీవు మామనసులను దోచి
ఏమని యేగెదవో యిపుడు మధురకు
ఈమురళీరవ మిప్పు డేగాలి కోవిడిచి
ఏమని యేగెదవో యిపుడు మధురకు
కోమలమృదుకరముల గోపికలను చుట్టక
ఏమని యేగెదవో యిపుడు మధురకు
నీముద్దుమాటలకు మేమింక తగమనుచు
ఏమని యేగెదవో యిపుడు మధురకు
ఆమూర్ఖుడు కంసుడు తామసుండని యెఱిగి
ఏమని యేగెదవో యిపుడు మధురకు
ఈమా రేపల్లెలో యిన్నాళ్ళుగ పెరిగి
ఏమని యేగెదవో యిపుడు మధురకు
మేము నీవిరహమున నేమగుదుమో తెలిసి
ఏమని యేగెదవో యిపుడు మధురకు
నీమహిమ నిందు నందు నేరుపుమై యుండక
ఏమని యేగెదవో యిపుడు మధురకు
(77)
8-5-2026



అశరీరవాణి పలికినది నెరవేర్చాలి. ధర్మపాలన మధుర లో తిరిగి నిలపాలి. దేవకీవసుదేవులను విడిపించాలి.
వొర్క్ ఫ్రొం హోం చేసే పనులు కావు. ఎళ్తెనే కష్ఠాలు రెండు యమునాతీరాలులో తీర్తాయి.