నందసుతా గిరిధారీ

నందసుతా గిరిధారీ
బృందావన సంచారీ

కుటిలాలక హరి గోపీమోహన
కుటిలదనుజ సంహారీ
స్ఫటిభోగాధిష్టితమృదుపదయుగ
నటనవిలాసవిహారీ

జగదీశ్వర హరి సర్వమనోహర
అగణితగుణమణి శౌరీ
ఖగపతివాహన కలుషవిమోచన
నిగమారణ్యవిహారీ

జయ వ్రజకన్యాప్రియనిజమురళీ
జయజయ రాసవిహారీ
జయ శిఖిఫించాలంకృతమౌళీ
జయ భవదుఃఖవిదారీ

(78)

24-5-2026

1 thought on “నందసుతా గిరిధారీ”

  1. “అగణితగుణమణి శౌరీ”
    ఏన్నొ గోవులను రక్షింపబడిన వాడైన శౌరీ గిరిని  యెత్తటమ్తో అన్న అర్థం బాగా తీసుకు వచ్చె ప్రయత్నం ప్రయొగం కూడా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top