నందసుతా గిరిధారీ
నందసుతా గిరిధారీబృందావన సంచారీ కుటిలాలక హరి గోపీమోహనకుటిలదనుజ సంహారీస్ఫటిభోగాధిష్టితమృదుపదయుగనటనవిలాసవిహారీ జగదీశ్వర హరి సర్వమనోహరఅగణితగుణమణి శౌరీఖగపతివాహన కలుషవిమోచననిగమారణ్యవిహారీ జయ వ్రజకన్యాప్రియనిజమురళీజయజయ రాసవిహారీజయ శిఖిఫించాలంకృతమౌళీజయ భవదుఃఖవిదారీ (78) 24-5-2026


