నందనందన మురళినూదరా ఓ
రందగాడ పాటపాడరా
అందమైన పెదవులపై అందమైన మురళి జేర్చి
అందగత్తె లందరు మెచ్చ అందగాడ పాటపాడరా
అందమైన యమునాతట మందమైన సాయంతన
మందమైన మలయానిల మందగాడ పాటపాడరా
అందమైన ముఖముపైన నందమైన ముంగురులే
యందముగా చిందులాడ నందగాడ పాటపాడరా
అందమైన కొప్పుమీద నందమైన శిఖిఫించ
మందగించ మధురమధుర మందహాస పాటపాడరా
అందునా నీకిష్టమైన ఆందమైన పొన్నచెట్టె
అందమైన విడిదిగా పసందైన పాటపాడరా
అందమైన హృదయమున్న ఆందమైన కనులవాడ
అందమైన పలుకువాడ ఆందగాడ పాటపాడరా
సుందరవదనారవింద బృందారకజనవంద్య
కుందరదన గోపజనానందకంద పాటపాడరా
చందమామ వచ్చె పూర్ణచంద్రవదన చంద్రిక లివె
యందముగా పరచుకొన్న వందగాడ పాటపాడరా



శత్యభామ వేలం పాట పాడినా చిక్కలెదు. రుక్మిణీ యొక్క తులసి దళం తో నారదుడు వీణ కి దక్కలెదు. గజేంద్రుడు ప్రహ్లాదుడు ద్రౌపది పడిన పాట్లు కి లొంగేడు. కుచేలుడు అటుకులు కి మేలుచేసాడు. వూదినదే పాట ఆడినదే ఆట.