రింగ్స్

కొందరు కాంట్రాక్టర్లు ఒక రింగుగా ఏర్పడతారు
ఒక పధ్ధతి ప్రకారం అందరూ టెండర్లు వేస్తారు
అందరికీ మిగతా అందరి బిడ్ల గురించి తెలుసు
కాంట్రాక్టు ఎవరిదన్నదీ ముందే నిర్ణయమౌతుంది
బయటి వాళ్ళు బిడ్లు వేయకుండా అడ్డుకుంటారు
వంతులవారీగా టెండర్లన్నీ వాళ్ళే పంచుకుంటారు
కలిసికట్టుగా వాళ్ళందరూ చక్కగా బాగుపడతారు
వాళ్ళు బాగుపడటాన్ని ఎవరూ అడ్డుపడలేరేమో
కొందరు సాహితీవేత్తలూ రింగులుగా ఏర్పడతారు
ఒక పధ్ధతిప్రకారం ప్రకారం పుస్తకాలు వండుతారు
అందరికీ మిగతా అందరి గుణదోషాలూ తెలుసు
వంతులవారీగా తమలోతాము పొగడుకుంటారు
ముందుమాటలూ వెనుకమాటలూ తమలోతామే
బయటివాళ్ళు విమర్శించకుండా అడ్డుకుంటారు
కలిసికట్టుగా వాళ్ళందరూ చక్కగా బాగుపడతారు
వాళ్ళు బాగుపడటాన్ని ఎవరూ అడ్డుపడలేరేమో
డాక్టర్ల రింగులూ లాయర్ల రింగులూ సాధారణం
యాక్టర్లు రింగులూ నిర్మాతల రింగులూ సాధారణం
కలిసికట్టుగా వాళ్ళందరూ చక్కగా బాగుపడతారు
రింగులన్నీ అందుకే మనం చూస్తూ ఉండేందుకే

18-4-2026

1 thought on “రింగ్స్”

  1. This must ring a bell. No infrastructure possible. These ecosystems have to be shown that economic corridors of the past have not helped Bharat grow. To some extent there is a trap ring built in the past few years but lots more needs to be done. The vigil should continue.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top