నాతో బాటే పుట్టాయి నా ఆశలు
నాతోనే పెరిగాయి నాఆశాభంగాలూ
నాకన్నా ముందే నాకష్టాలు పుట్టాయి
నా ఆశాలతలే ఆహారం చేసుకుంటూ
నాకన్నా వేగంగా నాకష్టాలే పెరిగాయి
నా ఆశలన్నీ యెపుడో చచ్చిపోయాయి
ఐనా నాకష్టాలు పెరుగుతూనే ఉన్నాయి
ఇప్పుడవి నన్నే పీక్కొని తింటున్నాయి
15-4-2026


