కోరిన వెన్నో కాలం
కసిరి కసిరి ఆహరించెను
కోరని వెన్నో కాలం
కొసరి కొసరి వడ్డించెను
తీయని వెన్నో కాలం
హాయిగాను దొంగిలించెను
చేదుల నెన్నో కాలం
చేతులతో తినిపించెను
మాయల నెన్నో కాలం
పన్ని నన్ను బాధించెను
తాను కరుగుతూ కాలం
నన్నిట్టే కరిగించెను
కోరిన వెన్నో కాలం
కసిరి కసిరి ఆహరించెను
కోరని వెన్నో కాలం
కొసరి కొసరి వడ్డించెను
తీయని వెన్నో కాలం
హాయిగాను దొంగిలించెను
చేదుల నెన్నో కాలం
చేతులతో తినిపించెను
మాయల నెన్నో కాలం
పన్ని నన్ను బాధించెను
తాను కరుగుతూ కాలం
నన్నిట్టే కరిగించెను