మనసారా నేడు నీతో మాటలాడ నీరా
తనివితీర నగుమోమును నను గననీరా
మథుర కేగినచో నీవు మరలివత్తువో రావో
మధురమధుర మందహాస మాకు దూరమగుదువో
సుధామధురమురళీరవసంశోభిత బృందావన మిక
వ్యథ చెంది నేటి నుండి బహుదీనత చెందునో
అచటనున్న వారి బాధ లంతరించ నీవేగిన
ఇచటనున్న వారి శోక మెవరుతీర్తు రింక మీద
ఎచటనున్న నీసుఖమే యెంచు గోపికలకు నీవు
వచియింపుము మరువననుచు పరమపురుష శ్రీకృష్ణా
మరలమరల ముజ్జగముల మరలజేసి మరలజేయు
హరివి నీవు గోపికలను మరవకుందు వని తలతును
మరువలేని గోపీకలకు మహిని మనికి దుర్భరమై
తిరిగి నీవు వచ్చుదాక దేహములెటు నిలుచునో
(76)
5-5-2026



సుధామధురమురళీరవసంశోభిత బృందావన”
ఈ తేన మాటలు మీ రచన.
బృందావనం నుండి కన్నయ్యగారి వేణు గానము చెప్పే గుణపాఠం చీకటి పడకముందు దీపం చక్కపెట్టాలి. అలాగే చదువే వెలుగునిస్తుంది అని కూడా. అడుగులే గూగుల్ మాప్స్ కూడా. ఆయన్ని పట్టుకొడానికి లేక కావాల్సింది ఏర్పాటు చేసుకోవటానికి గోతులో పడకుండా.