అనంతకోటి బ్రహ్మాండాల్లో ఒకదాంట్లో
దేంట్లోనే ఉందటారు మన భూమిని
అంటే ఇదెంత చిన్నదో కదా
ఐనా దీనిపై జీవు లెన్నెన్నో
అనంతకోటి జీవరాశిలో నరజాతిలో
నేనూ ఒక పేరూ ఊరూ లేని నరుణ్ణి
అంటే నేనెంత అల్పుణ్ణో కదా
ఐనా నాలోని ఆశ లెన్నెన్నో
అనంతకోటిసంఖ్యాక మైన నాఆశల్లో
ఏవీ ఎన్నడూ నెరవేరని అభాగ్యుణ్ణి
అంటే అవెంత అల్పములో కదా
ఐనా ఒకటైనా చివరకు నెరవేరదా
అనంతకోటి జన్మలెత్తిన అభాగ్యుడికి
ఏజన్మల్లో ఎన్నెన్ని ఆశాభంగాలో కదా
ఆఖరికోరికగా మిగిలిందేమిటో తెలుసా
ఇక జన్మలూ వద్దు ఆశలూ వద్దన్నదే
22-4-2026



సంకల్పం, చేతులు ముద్ర కుడి తొడ మీద పెట్టి, చెప్పటం పేరు ఊరు తెలియపరచటము. ఆదే విధముగా చెవులు పట్టుకొని ప్రవర చెప్పటం కూడా.
మానవుడు వలనే భూమి కి ఒక పరిచయం ఈ అనంతకొటి బ్రహ్మాండం లో. మానవ జన్మ అందువల్లే దుర్లభం.
ప్రవర సంకల్పము తొ భూదెవి ద్వారా శ్రీదేవి సైతం శ్రీవారి మంచి పుస్తకం లో పేరు నమోదు జరిగినట్టే.