నాయిల్లొక మౌనపీఠం
నాబ్రతుకొక మౌనగీతం
ఇంకెవరూ లేని యింట్లో
మౌనంతోనే సహవాసం
పగళ్ళైనా రాత్రులైనా
మౌనంలోనే గడవాలి
ఇకపైన కాలచక్రం
మౌనంగానే తిరగాలి
నా నిష్క్రమణక్షణమూ
మౌనంగానే గడపాలి
మౌనపీఠం నుండి నేను
మౌనంగానే జారాలి
మౌనంగా నిజధామానికి
నేను చేరి నిలిచాక
మౌనంగా చూచును లోకం
వట్టిపోవు మౌనపీఠం
5-4-2026


