నేనింకా బ్రతికే ఉన్నాను
ఆశానిరాశల భీకర పోరాటాల మధ్యన
మంచీచెడుల మహాయుధ్ధాల మధ్యన
ఎగురుతున్న అస్త్రాల శకలాలు వేలుగా
నిత్యం నానెత్తిన పడుతూనే ఉన్నా
నేనింకా బ్రతికే ఉన్నాను
నిందలు నా ఉనికిని గాయపరుస్తున్నా
ఎందరి శాపవాక్కులో నను రక్కుతున్నా
అందని ప్రశాంతత హతాశుణ్ణి చేస్తున్నా
నిత్యం కష్టాలు నిప్పులు కురిపిస్తున్నా
నేనింకా బ్రతికే ఉన్నాను
ఎందుకు బ్రతికున్నానో తెలియకపోయినా
ఎందుకు బ్రతికుండాలో తెలియకపోయినా
ఎందరికో నాఉనికి నచ్చకుండాపోయినా
శోకమోహాలన్నీ వదలి హాయిగా నేనున్నా
15-4-2026


