అదంతే

పోగుచేసిన జ్ఞాపకాలు పంచిపెట్టేవు
ముసలివాడి జ్ఞాపకాలెవరు వింటారు
వినేవారు లేక తుదకు మూగవయ్యేవు
పోగుచేసిన పుస్తకాలు పంచిపెట్టేవు
పాతపుస్తకాల వంక ప్రజలు చూడరు
తూకానికి పోయేను తుదకు గ్రంథాలు
పోగుచేసిన స్థిరాస్తులే పంచిపెట్టేవు
ఎక్కడో భూములు ఎప్పటివో కొంపలు
అవన్నీ పిల్లలు అమ్మి పారేస్తారు
పోగుచేసిన జ్ఞానమునే పంచిపెట్టేవు
ఎప్పటివో నీనీతుల నెవరు వింటారు
నీజ్ఞానము నీలోనే అణగి పోయేను
అపురూపపు దేహాన్నే విడచివెళ్ళేవు
హడావుడిగా దానిని తగలబెట్ఠేరు
నీ నిన్నటి గొప్పను నేడెవరు తలచేరు

1-4-2026

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top