వాన ఒకోసారి బాగుంటుంది
మనం ఇంట్లోనే ఉన్నప్పుడు
బయటకు పోయే పనిలేనప్పుడు
వాన ఒకోసారి బాగుండదు
మనం బజార్లో ఉన్నప్పుడు
ఇంటికి పోవటం అడ్డుకున్నప్పుడు
వాన ఒకోసారి బాగుంటుంది
ఇల్లు కురవకుండా ఉన్నప్పుడు
కిటికీలో నుంచి చూస్తున్నప్పుడు
వాన ఒకోసారి బాగుండదు
నీళ్ళు లోపలికి వస్తున్నప్పుడు
క్రికెట్ మాచ్ ఆగిపోయినప్పుడు


