మబ్బులు కొండను మింగినప్పుడే వానలు వచ్చాయి
వానలు నేలను తడిపినప్పుడే మొక్కలు వచ్చాయి
మొక్కల చక్కదనానికి చల్లని గాలులు వచ్చాయి
చల్లగాలులకు పరవశించిన మొక్కలు పూసాయి
పూవుల పరీమళాలను గాలులు మోసుకు పోయాయి
పరీమళాల జాడలు తీస్తూ తుమ్మెద లొచ్చాయి
తుమ్మెదలన్నీ కదిలాయని విని పూవులు మెచ్చాయి
మెచ్చిన పూవులు తుమ్మెదలకు మకరందం ఇచ్చాయి
పూవులు విందులు చేస్తున్నాయని వసంత మొచ్చింది
విందులు చేసిన పాదపాలకు పిందెలు వచ్చాయి
పిందెల చిరుచిరు వగరులకోసం కోకిల లొచ్చాయి
కోకిలపాటలు వినటానికి విరిబోణులు వచ్చారు
అందా లిటు నటు గెంతుతు ఉంటే అవని మెచ్చుకొంది
6-4-2026


