నీతో మాట్లాడే వాళ్ళూ
నీకోసం వచ్చే వాళ్ళూ
నీచుట్టూ తిరిగే వాళ్ళూ
నీవాళ్ళే అనుకున్నావా
నీమాటకు నవ్వే వాళ్ళూ
నీచేతలు మెచ్చే వాళ్ళూ
నీతో పనిచేసే వాళ్ళూ
నీవాళ్ళే అనుకున్నావా
నీవెంబడి నడిచే వాళ్ళూ
నీబాధల కేడ్చే వాళ్ళూ
నీకోసం బ్రతికే వాళ్ళూ
నీకెవరైనా ఉన్నారా
నీ కోసం వగచే వాళ్ళూ
నిన్నెన్నడు మరువని వాళ్ళూ
నీసత్యా న్నెరిగిన వాళ్ళూ
నీకెవరైనా ఉన్నారా
నీకున్నారని భ్రమపడకు
నీవాళ్ళెవరూ లేరయ్యా
నీతో పని ఉన్నన్నాళ్ళే
నీవాళ్ళై తోస్తారంతా
ఎవరూ లేరే లోకంలో
తాపత్రయాలు దేనికని
నీవాడవు నీవొక్కడవే
పైవారేలే జనులంతా


