ఈ ప్రపంచానికి ఏదీ నచ్చజెప్పలేక పోతున్నాను
ఆ విషయం నాకు తీవ్రంగా అసంతృప్తి కలిగిస్తోంది
నాకు కూడా నచ్చజెప్పలేక పోతోంది ప్రపంచం
ఆ విషయం తనకు తీవ్రంగా అసంతృప్తి కలిగిస్తోంది
మిత్రులంతా ఈవ్యవహారాన్ని గమనిస్తున్నారు
నాకూ ప్రపంచానికీ కొంచెం శత్రుత్వం కనిపిస్తోంది
ఆ విషయం వాళ్ళకు తీవ్రంగా అసంతృప్తి కలిగిస్తోంది
ప్రయత్నాలు అన్నివైపులా నిత్యం జరుగుతున్నాయి
అదొక్కటే అందరికీ సంతృప్తిని కలిగిస్తోంది


