పెద్దరికం

ఎవరో ఏవండీ అని పిలిచారు
బస్సులో వెనుక సీటులో నుండి
చేతిరుమాలు పడిపోయింది చూసుకోండి అన్నారు
పదహారేళ్ళ కుర్రవాడిని
పెద్దవాణ్ణయ్యానని అనిపించింది
కొంచెం గర్వం కూడా కలిగింది

ఎవరో ఏవండీ అని పిలిచారు
రోడ్డు మీద నా వెనుక నుండి
జాగ్రత్త పెద్దవారు ట్రాఫిక్ చూసుకోండి అన్నారు
అరవైయేళ్ళకే పెద్దవాడినా
ఏమిటి ఇలాగయ్యానని అనిపించింది
కొంచెం సిగ్గు కూడా కలిగింది

ఇదిగో ఈచేతికర్ర తీసుకోండి
అని మాబావగారు చెప్పలేదు
తెచ్చి నాకందుబాటులో పెట్టారు
పాత ఫోటోల్లో చేతికర్ర ముసలాళ్ళను
బలే ఠీవిగా ఉన్నారనుకునే వాడిని
డభ్భైమూడేళ్ళ పెద్దవాడిని
ఏమిటీ చేతికర్ర వచ్చిందే అనిపించింది
ఎందుకో ఠీవిగా అనిపించలేదు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top