రేపేమి

రేపేమి జరుగనున్నదో నా
పాపమేమి పండనున్నదో

ఇన్ని దశాబ్దాల జీవిత మేమి నేర్పినది నాకు
తిన్నగ పదినాళ్ళు చిక్కులన్నవే లేని దెపుడు
ఇన్నాళ్ళుగా నేననుభవించినవే చాలవో
ఎన్నాళ్ళని సుఖము కోరి యీ‌ యెదురుచూపులు

పతితిపావనా రామా పతితుడనో భ్రష్టుడనో
యతిశయమై పురాకృతంబైన పాప మెంతున్నను
సతతము నీనామస్మరణ సలుపుచున్న దీనుడనే
అతులితమగు నీదయామృతము నందించకున్న

ఒక్కసారి రామా యన తుక్కగునే పాపంబులు
నిక్కువముగ రామ నిన్ను పెక్కుడు జన్మంబులుగ
చక్కగ భజియించు నన్ను మిక్కిలిగా నాదరించి
దిక్కై నీవుండకున్న తెల్లంబుగ నాబ్రతుకున

3 thoughts on “రేపేమి”

  1. Ravi Kharidehal

    వడ్డీ తొ సహ అసలు అర్పితం చెయ్యాలి.
    అందుకే అధికారులు నిన్నే పని పూర్తి అర్పితం చెయ్యాలి కదా అంటారు. క్యూ ఆర్  కోడ్ స్కాన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది.
    “డీ యన్ యె” కు తగ్గ “క్యూ ఆర్ కోడ్” ఉంటే “రేపు” స్కాన్ లోకి చూడ వచ్చు  ఎవరికి వారు.

  2. శ్యామలరావు

    తెలుగులో వ్యాఖ్య పంపినందుకు ధన్యవాదాలు రవీ.

    1. “ప్రముఖ” పాత్ర మీదె. దాన్ని వాడి అడుక్కొవదం నా వొంతు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top