వర్తమానం గురించి అంటూ ఏమీలేదు నమ్మండి
ఒక సరళరేఖపైని బిందువు త్రిపరిమాణరహితం
ఒక కాలరేఖపైని వర్తమానబిందువు ఆట్టిదే
ఆరేఖపైని బిందువును కచ్చితంగా కొలవలేం
కాలరేఖపైని వర్తమానబిందువునూ పట్టుకోలేం
ఉనికి అనేది అనుమానప్రమాణమే రెండింటికీ
ఉనికిని నిర్దేశించాలంటే పరిమాణం కావాలి
కాని ఆబిందులు రెండూ పరిమాణరహితాలాయే
అనుక్షణం ప్రతిక్షణం గతక్షణంగా మారిపోతోంది
అందుకే గతం అన్నది అనంతకాలరేఖగా ఉంది
అలాగే వర్తమానమూ అనంతకాలరేఖగా ఉంది
ఎటొచ్చీ వాటిమధ్య వర్తమానం అనుమానంగా ఉంది
అచ్చం సరళరేఖపైన బిందువంత అనుమానాస్పదంగా
2026-08-22


