భావన చేయవయా

జీవా జీవబ్రహ్మైక్యతనే భావన చేయవయా
భావన చేయుచు విశ్వమయంబగు బ్రహ్మము నెరుగవయా

ప్రపంచమంతా బ్రహ్మమయంబని భావన చేయవయా
విపరీతంబుగ తలచుట యది యవివేకము తెలియవయా

బంధములెందుకు బాధలెందుకని భావన చేయవయా
బంధము లన్నీ భావనలే నని భావన చేయవయా

బ్రహ్మమెక్కటే పరమసత్యమని భావన చేయవయా
బ్రహ్మము నీకన్యంబుగ లేదని భావన చేయవయా

సత్యస్ఫురణకు హరికృప యొకటే సాధన మెరుగవయా
నిత్యము రామా యంటే హరికృప నీకు లభించునయా 

(2713)

9-5-2026

3 thoughts on “భావన చేయవయా”

  1. రవిశంకరుగారి జీవనకళతో అనుభవం వచ్చునట్లు మీ రచనధారణా ఉంది. విరళం కాని సులభం, ప్రయత్నం తో అనుభవించవచ్చు. అలోచనశక్తి కోసం బాదంపప్పు ని బాధెరు.

    1. శ్యామలరావు

      మీకామెంటు ఏమీ అర్ధం కాలేదు

      1. (రవిశంకరుగారి జీవనకళతో)-Ravi Shankar’s Art Of Living is a sanatana cultural model that inspires on the lines that you have advocated.

        “భావన చేయవయా” అనే మీ యొక్క రచన రవి షంకర్’స్ ఆర్ట్ ఓఫ్ లివింగ్ మొడెల్ వలే ఉన్నది. వాళ్ళ భవనము ఒకటి నిన్న ప్రధానమంత్రి గారు అనుభవించారు ఒక మంచి భావన కూడా వ్యక్తం చేసారు.
        ఏ విధమ్గా మీరు ప్రెరేపించారో ఆర్ట్ ఒఫ్ లివింగ్ మొడెల్ వంటి ది.

Leave a Reply to Ravi Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top