ఇంత అల్ల రెందుకురా ఇన్ని యాట లెందుకురా
సంతతోద్యద్దయా మా కంతు పట్ట కున్నదిరా
గోవింద విలపించెడు కుందరదనలను చూడుము
నీవారము కామా మానేరమేమి వ్రజసుందర
భావజశతకోటికోటిపరమసుందరాకార
దేవదేవ కృపామయా తెలియరార దాగనేల
వ్రేతలపై నీకెందుకు ప్రీతి దప్పినది నేడు
ఆతురలము మమ్ము విడిచి యందందున దాగేవే
మూతి బిగియించి నీవు పొన్నచెట్టెక్క నేల
చేతిలోని మురళినూద చిత్తమేల రాదు నీకు
యమునాతటసైకతవిహారభూములను నీవు
విమలగాంధర్వహేల వెలయించుటలు మాని
అమాయికల గోపికల నారడిపెట్టే విదేమి
అమలినశృంగారరసమహార్ణవ గోపాలకృష్ణ
(74)
24-4-2026



పెంకి ఎత్తు వేసినా ఈ అల్లరి ఆట కట్టు వెయ్యాలి. అంటే దామ ఉదరం కి పని చెప్పాలి . అల్లరి చెయ్యకుంటే యెలా. రొలు లాక్కు వెళ్ళి పని పూర్తి కావాలి కదా.