ఎవరితో మాట్లాడుతాను
ఎవరూ తోడులేని యింట్లో
మౌనం రాజ్యం చేసే యింట్లో
ఫోను మోగితేనే మౌనభంగం
ఫోనుకోసం ఎదురుచూడలేను
నేను టీవీ పెట్టుకొని ఉంటాను
నేనేం చూస్తానన్న దముఖ్యం
ఈనిశ్శబ్దశిక్ష తప్పటం ముఖ్యం
టీవీతో ఈదోస్తీ ఎంతోబాగుంది
కేవలం అదే మాట్లాడుతోందింట్లో
21-4-26



ప్రొఫైల్ ఫొటొ చూస్తె సొఫా లొ ట్టీవీ గా ఆలొచనలొ ఉండి టీవీ చప్పుడు డప్పు లొ మగ్నం అవకుండా మాత్రం మంచి రచనలు యెర్పాటు చెయ్యగలుగు తున్నరు.
మీ శ్రమ కి డప్పులు కొట్టాలి.
రవీ,
ఈ నిశ్శబ్దశిక్ష నుండి ఆటీవీ సందడి కొంచెంగా ఉపశమనం. అంతే కాని, నాలోని ఒంటరితనాన్ని టీవీ యేమంత దూరం చేయగలదు? ఐతే నాలోనేను మాట్లాడుకుంటూ ఉండాలి లేదా నేను రాముడితో నైనా మాట్లాడతూ ఉండాలి. ఆమాటలు అటువైపు తిరిగితే మెటాఫిజికల్ పోయెట్రీ గాను ఇటువైపు తిరిగితే రామసంకీర్తనం గానూ బయటకు వస్తున్నాయి.
అన్నీ ఒకరోజున ఆగక తప్పదు నానిష్క్రమణంతో. దానికోసమే యెదురుచూస్తున్నాను.
అపుడు నాతోపాటే నావ్రాతలూ మాయం కావచ్చు. అర్ధంచేసుకోగల రసజ్ఞులు అంటూ ఉంటే కొన్నాళ్ళు ఈనా పిచ్చివ్రాతలు ఆ సహృదయుల గుండెల్లో నిలబడనూ వచ్చును. ఆంతా దైవేఛ్ఛ.
కొన్వస్మిన్ సామ్ప్రథమ్ లొకె గుణవాన్ కశ్చ వీర్యవాన్ ”
ఈ శ్లొకం తొ వాల్మికి ప్రస్న నారదుడు కి. రామాయణం మొదలు. ఇంటి ఇంటి రామాయణం అదె విధంగా ఉంటుంది. అందు వల్లె భరతదెసం లొ రామాయణం నిలపబడింది.
ఇదీ ఒక అటువంటి ప్రయత్నం మీది.