ఇళ్ళెన్నొ తిరిగి నా
ఇల్లొక టుండాలని
ఉల్లము నందున తరచేవు
మెల్లగ నీకొక నాటికి
చల్లగ పైకొచ్చేవు
ఇళ్ళెన్నొ కట్టేవు
ఇళ్ళకు సొబగులు కూర్చే వా
ఇళ్ళను చూచుచు మురిసేవు
ఈయిల్లు నాదని
ఆయిల్లు నాదని
ఎల్లరి తోడను పలికేవు
ఉల్లములో కడు మురిసేవు
ఇల్లాలు మురియగా
పిల్లలే మురియగా
చల్లగ కాలం గడిపేవు
మెల్లగ నాయువు తీరేను
ఇళ్ళెన్నో నీకున్నా
ఇళ్ళన్నీ వెడలించగ
ఇల్లుండదు నీవుండగ
చల్లగా కొన్నాళ్ళకు
ఇల్లొక్కటి చొచ్చేవు
ఎల్లరితో మాయిల్లంటూ
మళ్ళా పలుకుచు నుండేవు
15-4-2026


