వసంతం వచ్చి వెళ్ళిపోతున్నదని తెలియక
ఉగాది కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం
వాయుకాలుష్యాన్ని పెంచిపోషిస్తూనే
వేపపూత కోసం ప్రకృతిని వేడుతున్నాం
మామిడిపూత కోసం ఆరాటపడుతున్నాం
ఆట్టే పూలుపూయని వసంతం
ఆట్టే కాపుకాయని వసంతం
గట్లపై కాలూనలేని వసంతం
చెట్లపై విరబూయలేని వసంతం
వస్తూనే తిరుగుప్రయాణం చేసింది
పంచాంగం ఉగాది అన్నరోజుకే
గ్రీష్మం రాజ్యం చేస్తూ ఉంది
ఏదో చెట్టు మీద నుండి
అక్కడ మామిడిపూత లేకున్నా
ఆశచావని కోకిల కూస్తోంది


