నందసుతా గిరిధారీ
బృందావన సంచారీ
కుటిలాలక హరి గోపీమోహన
కుటిలదనుజ సంహారీ
స్ఫటిభోగాధిష్టితమృదుపదయుగ
నటనవిలాసవిహారీ
జగదీశ్వర హరి సర్వమనోహర
అగణితగుణమణి శౌరీ
ఖగపతివాహన కలుషవిమోచన
నిగమారణ్యవిహారీ
జయ వ్రజకన్యాప్రియనిజమురళీ
జయజయ రాసవిహారీ
జయ శిఖిఫించాలంకృతమౌళీ
జయ భవదుఃఖవిదారీ
(78)
24-5-2026



“అగణితగుణమణి శౌరీ”
ఏన్నొ గోవులను రక్షింపబడిన వాడైన శౌరీ గిరిని యెత్తటమ్తో అన్న అర్థం బాగా తీసుకు వచ్చె ప్రయత్నం ప్రయొగం కూడా.