దేవుడంటే మోసం అనుకుంటాడు మనిషి
మనిషంటేనే మోసం కదా అంటాడు దేవుడు
అడిగన వన్నీ యివ్వడీ దేవుడని మనిషికి అలక
అడిగిన వన్నీ పనికిరాని వని దేవుడికే యెరుక
ఇచ్చిన వన్నీ పనికిరాని వని మనిషికి గట్టి నమ్మకం
ఇచ్చిన వాటి విలువ నెరుగడని దేవుడి స్థిరనమ్మకం
దేవుణ్ణి యేమడగాలో మనిషికి తెలియటం లేదా
మనిషికి యేమివ్వచ్చునో దేవుడికి తెలియటం లేదా
ఈవిషయం తేల్చుకుందుకు యిద్దరూ ప్రయత్నించాలి
ప్రయత్నించకుండా యెవరూ యెవరినీ తెలుసుకోలేరు
మనుషుల్లోకి దిగివచ్చి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు
తాను దేవుడైతేనే మనిషికి దేవుడూ అర్ధం కాలగడు
మనిషి కావటం దేవుడికి బహుసులభంగానే కనిపిస్తోంది
దేవుడుగా మారటం మాత్రం మనిషి వలన కావటం లేదే
లేని దేవుడిగా మారలేక పోతున్నానేమో అని సందేహం
అందుకే దేవుడంటేనే మోసం అనుకుంటా డొక మనిషి
29-4-2026



పుణ్యం పురుషార్థం అనడం వింటాము. మానవుడు పుణ్యం పురుషార్థం తో సమకూరుస్తాడు. పుణ్యం అంటే ధనం అనుకొవటం మానలెడు. ధనం ఖర్చు కి.
కానీ పుణ్యం సమకూర్చు కునేది ఆ దేవబలం స్వంతం చేసి ఆ ఆత్మబలం తో వ్యవహరిన్చటానికి.
సందెహాలు తో ఉన్నప్పటికీ “బెనెఫిట్ ఒఫ్ డౌట్” అంపైర్ అనే దైవం కి వదలి పెడ్తే పుణ్యం పెరుగుతుంది కాని తరగదు. రాముడు ఉదాహర్ణం. ధర్మాన్నె పట్టుకున్నాడు . మర్యాదా పురుషొత్తముడు అనె బిరుదు తొ సన్మానం పొందేడు.