ప్రయాణం

ఒకరోజు గడవట మెంత కష్టం
ఒకోసారి అది బహు దుర్భరం
ఒకరోజు గడచిపోయి నప్పుడు
ఒకమెట్టు పైకెక్కి నట్లే ఉంటుంది
ఇంకా ఎన్నిరోజులు గడవాలో
ఇంకా ఎన్నిమెట్లని యెక్కాలో
ఎన్నిరోజు లింకా యీప్రయాణం
ఎన్నిమెట్ల పైనుందా శిఖరాగ్రం
శిఖరాగ్రం దాకా నా ప్రయాణం
జరిగేనా మధ్యలోనే సడలేనా

22-4-2026

1 thought on “ప్రయాణం”

  1. గానమె సొపానమూ …. advaita  సిద్ధి అమరతన లబ్ధి …. స రి గ మ ప ద ని … సరిగ్గ పాడమని…. సరిగ్గ పదమని …. 
    ఎన్ని మెట్ళు ఎక్కినా ఉట్టె అందుతె చాలు.

Leave a Reply to Ravi Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top