గెలుపు

నేనోడిపోతున్నపుడు లోకంలో
నన్నెవరూ పట్టించుకోరు కాని
నేను గెలుపుబాట పడితే మాత్రం
నా ఓటములను ప్రచారం చేస్తారు

నా ఓటములకు కారణం నేనే నని
అందరికీ బోధించే మహాత్ము లెవరూ
నా విజయాలకు కాణం నేనే నని
పొరపాటున కూడా అననే అనరు

అడుగడునా నన్నడ్డుకున్న వాళ్ళు
నా విజయాలు ఋజువైన వేళల్లో
తమతమ పాత్రలను చాటుకుంటారు
నా గెలుపుల్ని తాము జమకట్టుకుంటారు

చివరికి గెలిచేది నేనే ఐనప్పటికీ
అది చాటుకొనేందుకు నేనుండను
చివరికి నిలిచేది నేనే ఐనప్పటికీ
అది నాకొక్కడికే తెలిసిన సంగతి

204-2026

2 thoughts on “గెలుపు”

  1. Chaatu gaa undi Arjunudu ki kurukushetra lo vijayam. Ainappatiki Krishnudu de vijayam ani chaatimpabadindi.
    Ramudu vijayam dharmam di.
    Anduku Bharatadesam lo inta inta Ramo vigrahavaan dharmah.
    Teliyakunda unna parabrahmam telusukune prayatnam.

  2. గెలుపుకి అందరూ చుట్టాలే! ఓటమికి అన్నీ కారణాలే!!

Leave a Reply to Sarma Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top