పలుకరింపులు

ఏనాడైనా
ఎవరైనా పలుకరిస్తారని
ఎదురుచూస్తూ ఉంటాను
ఎవరికి తీరిక ఉంటుంది
ముసలోడితో ముచ్చట్లకు

పోనీ నేనే
ఎవరినైనా పలుకరిధ్ధామని
ప్రయత్నం చేస్తూ ఉంటాను
ఎవరికి ఆసక్తి ఉంటుంది
ముసలోడితో ముచ్చట్లకు

తరచు నేనే
పలుకరించటం వలన
పలుచనకావటం చూసా
పలుకులుడిగి మౌనం
పాటిస్తున్నా నవజ్ఞత వద్దని

16-4-2026

6 thoughts on “పలుకరింపులు”

  1. Conical shaped vedi verusenagapalukulu potlalu pattukunte konni palukulu shabda roopamulo nisshabdhani toligistaayi.
    Current affairs teliyaparustai. Konni lopaliki velli aarogyaparustai. Koncham jebulu nindi mallaa repatiki vanarulu madupu ki chekurustai. నవజ్ఞత erpatu jarugunu kudaa.

    1. శ్యామలరావు

      రవీ,
      “పాటిస్తున్నా నవజ్ఞత వద్దని” అని వ్రాసినచోట పదవిభజన “పాటిస్తున్నాను అవజ్ఞత వద్దు అని”. అంతే కాని “నవజ్ఞత” అని కాదు.

      1. Naa aalochana ki maro tova choopinchi verusenaga nundi veru-chinta palukulu ki avakaasam chesaaru. Dhanyadamulu.

      2. Paluku-badi lo vidyarthi gaa gamanam modalu petti vividha vibhajanalu nerchi palukulu chese prayatnam konasaaguthundi.

  2. నేటి యువతకి వయసు మళ్ళినవారితో మాటాడే ఓపిక,తీరిక రెండూ లేవు. ఇక ఇద్దరు వయసు మళ్ళినవాళ్ళు కలిసేది ఓల్డేజి హోముల్లోనే! వీరికి మాటాడేందుకు ఏంలేదు,కాళ్ళనొప్పులు,కీళ్ళ నొప్పులు,బి.పి,సుగర్ ఇలా తప్పించి. తమ,కొడుకుల,కోడళ్ళ;కూతుళ్ళ అల్లుళ్ళ;మనవల అమెరికా వాసం గురించి గొప్పలు చెప్పుకునే రోజులు గతించిపోయినట్టున్నాయి. ఇక మిగిలింది సోషల్ మీడియా! ఇందులో ఎంత తక్కువ మాటాడితే అంత మంచిదని నా ఊహ,ఇది నిజం కాకకపోవచ్చును కూడా! మొత్తంగా మనతో మాటాడేవారు… లేరు. దీని గురించి బాధ పడటం వ్యర్ధం. మాటాడవలసినవాడు మాటాడడు,మనఊ వదిలేసేం లెద్దురూ!!
    ఇక ప్రస్థుతానికొస్తే వెబ్ బాగుంది. బ్లాగులోని కొన్ని ముఖ్యమైనవి ఇందులోకి రాలేదనుకుంటాను,లలితా సహస్రం లాటివి. ఇక శివానందలహరి,సౌందర్య లహరిలాటి కొన్నిటిని మీరు ఇదివరలో మొదలుపెట్టి కొంతలో వదిలేసినట్టుగుర్తు. అప్పుడు పూర్తి చేయలేకపోయినకారణం తెలియనిదేం కాదు. ఇప్పుడేనా పూర్తిచేసి ఇందులో ఉంచితే మీకు,మాకు కూడా ఉపయోగం అనుకుంటా! ఇందులో స్వార్థం ఉంది,ఇవేంటో తెలియనివాళ్ళం,కొంతేని తెలుసుకోడానికి సావకాశమన్నదే,అది. మీ వీలు,చాలు చూసుకుని పూర్తి చేస్తారని ఆశిస్తూ…
    శలవు

  3. శ్యామలరావు

    అవునండీ. బ్లాగులోనివి ఇక్కడ అనేకం రాలేదు.

    నాప్రణాళిక ఏమిటంటే అన్నీ పుస్తకాల రూపంలో ఇక్కడికి తేవటం. ఉదాహరణకు రామకీర్తనలు 2700 దాటి కొనసాగుతున్నాయి. వాటిని పుస్తకాలుగా చేసి ఇక్కడ ఉంచుతాను. ఇప్పటికే పాహిరామప్రభో శీర్షికన వచ్చిన 500+ పద్యాలనూ ఒక పుస్తకంగా అందుబాటులో ఉంచాను. అన్నీ అలాగే పుస్తకాలుగా ఇస్తే జనోపయోగం అని నా భావన.

    ఇక్కడ టపాలుగా అందిస్తున్న సాహిత్యమూ కాలక్రమేణా పుస్తకరూపం లోనికి ఒదుగుతుంది దైవానుగ్రహంతో.

    కాణాంతరాల వలన అసంపూర్ణంగా నిలిచిపోయినవీ సంపన్నం చేయించమని భగవంతుడిని అర్ధిస్తున్నాను.

Leave a Reply to శ్యామలరావు Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top