నవ్వకండి

అపనిందలకు నేడు జవాబు లేకపోవచ్చు
భగవత్కృప రేపు సమాధానం చెప్పవచ్చు
దయచేసి మీలో యెవ్వరూ నవ్వకండి
అపహసితులకూ మంచిరోజులు రావచ్చు

సమకాలము వారలు మెచ్చని వారికి
విమలకీర్తి లభించే కాలమూ రావచ్చు
ఈరోజున ఆహా ఓహోలతో ఊరేగేవారిని
ఆరోజున స్మరించే వారూ ఉండకపోవచ్చు

ఇప్పుడు కొందరికి దక్కిన పిచ్చిగౌరవాన్ని
అప్పుడు కొందరు విచిత్రంగా భావించవచ్చు
రేపు ఓడలు బండ్లై బండ్లే ఓడలూ కావచ్చును
కాలం దేనినైనా యెపుడైనా తిరుగవేయవచ్చు

ఊరూపేరూ లేదని యెవరినీ వెక్కించకండి
నేడు గర్వించే వారికే పేరు మిగలకపోవచ్చు
నేటి తిరస్కృతులే రేపు పేరు కెక్కనూ వచ్చు
నేడు నవ్వే గొంతులు రేపు వినిపించకపోవచ్చు

16-4-2026

2 thoughts on “నవ్వకండి”

  1. Quote from your effort –
    నేడు నవ్వే గొంతులు రేపు వినిపించకపోవచ్చు
    Laughing does not let any expression of words that can heard. But it does provide the face an outlet to the expression of the approval of the content to the hearts contentment.

Leave a Reply to Prasad Uppala Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top