మురళి నూదరా

మురళి నూదరా కృష్ణా
మురళి నూదరా
పరమ మనోహరము నీ
మురళి పాటరా

భువనమోహనము నీ మురళిపాట
శ్రవణసుభగమైన నీ చక్కనిపాట
కువలయాక్షు లందరు కోరెడుపాట
సవరించి నీ మురళిని సాగించు పాట

విన వచ్చె నదే మింటి పైన నా చంద్రుడు
వినగ నెమ్మదించిన యమున నటు చూడు
విన వచ్చి వేచిన గోపికలను చూడు
వినిపించి మురళిపాట వేడుక చూడు

పూపొదలు వేచియున్న మురళిపాట
యీపొలతుల ప్రాణమైన యింపగుపాట
గోపాలక యమృతమై కురిసెడు పాట
ఓప లేమింక పాడ నుద్యమించరా

2 thoughts on “మురళి నూదరా”

Leave a Reply to చెఱుకూరి విశ్వనాథ శర్మ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top